హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1పై హైకోర్టు తీర్పు నేపథ్యం లో ఎలా..? ముందుకెళ్లాలన్న విషయంపై అటు టీజీపీఎస్సీ, ఇటు సర్కారు మల్లగుల్లా లు పడుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సీఎంవో అధికారులతో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సం ప్రదింపులు జరిపినట్టు సమాచారం.
ఇక టీజీపీఎస్సీ మాజీ చైర్మన్లు, అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులతో నూ చర్చలు జరిపినట్టు తెలిసింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడమా..? లేక సుప్రీంకోర్టు కు వెళ్లడమా..? కోర్టు తీర్పును అనుసరించడ మా..? అన్న విషయంపై బుధవారం సా యంత్రం వరకు ఏదీ తేల్చలేదు. ఏ మార్గం లో ముందుకెళ్లడం ఉత్తమమన్న దిశలో చ ర్చలు సాగిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ముందుకెళ్లాలన్న ఆలోచనలో టీజీపీఎస్సీ వర్గాలున్నాయి. బుధవా రం కమిషన్ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆఫీసుకు రాలేదు. కమిషన్ కార్యదర్శి, సభ్యులు హాజరుకాగా సమావేశం జరగలేదు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే స్పష్టత వచ్చే అవకాశముంది.