Group 3 Results | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ విడుదలచేయనున్నది. నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షలకు 5,36,400 మంది దరఖాస్తు చేయగా, 2,69,483(50.24శాతం) మంది మాత్రమే హాజరయ్యారు.
దాదాపు 49.76శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారి జీఆర్ఎల్ను శుక్రవారం విడుదల చేస్తారు.