హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్1 మెయిన్ పరీక్షకు 1ః100 మంది చొప్పున అవకాశం కల్పించడం పెద్ద కష్టమేమి కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సచివాలయం సాధారణ పరిపాలన శాఖ నుంచి మెమోను పంపిస్తే టీజీపీఎస్సీ వారు 1ః100 మందిని అనుమతిస్తారని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
దీని వల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1:100 మందిని అనుమతించారని గుర్తుచేశారు. దీనిని మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.