సామూహిక సెలవులు పెట్టండి
ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) పిలుపునిచ్చింది. ఆదివారం టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
- 10న చేపట్టే చలో హైదరాబాద్‌కు భారీగా తరలిరావాలని టీజీవో పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) పిలుపునిచ్చింది. ఆదివారం టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, బీ శ్యామ్ మాట్లాడుతూ.. లక్ష మంది ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని కోరారు.
ఆగస్టు 27న ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించినా సర్కార్‌లో ఎలాంటి కదలికలేకపోవడంతోనే చలో హైదరాబాద్ తలపెట్టామని తెలిపారు. పెండింగ్ బిల్లులు నెలకు వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నా సరిపోవడంలేదని, పెన్షన్లకు వెయ్యి.. రెగ్యులర్ ఉద్యోగులకు వెయ్యి కోట్ల చొప్పున విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, కోశాధికారి సహదేవ్, ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, రామకృష్ణాగౌడ్, నరహరిరావు, మల్లేశం, హరికృష్ణ, దీపారెడ్డి, శ్రీరాంరెడ్డి, శిరీష, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

