మత్తు మాఫియాపై టీజీన్యాబ్ నిఘా!
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ యాంటీ-నారోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) దాడులు చేపట్టి, భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆశాఖ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిపిన దాడులు, స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు.
- గోవా టూ హైదరాబాద్ లింకుల ఛేదన
- హవాలా రూపంలో రూ.150 కోట్లు నైజీరియాకు..
- వివరాలు వెల్లడించిన టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ యాంటీ-నారోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) దాడులు చేపట్టి, భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆశాఖ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిపిన దాడులు, స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు తాగి 90మందికి పైగా దవాఖానలో చేరిన ఘటనపై స్పందించిన టీజీ న్యాబ్.. నిజామాబాద్ జిల్లాలోని 104గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు.
యువతకు క్రీడాసామగ్రి పంపిణీ చేసి, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. రెండు డ్రగ్స్ తయారీ కేంద్రాలపై సోదాలు చేపట్టి, భారీగా అల్ఫజోలం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గోవాలోని పర్రా ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి ‘లివియో’ అనే పెడ్లర్‌ను పట్టుకుని, అతని వద్ద కొకైన్, ఎండీఎంఏ, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. పెడ్లర్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, కేరళలోని 40మందికి పైగా డ్రగ్స్ సరఫరా అయినట్టు గుర్తించి.. వారి కోసం వేట మొదలు పెట్టినట్టు సందీప్‌శాండిల్య వివరించారు.
పబ్‌ల డీజేలపై ప్రత్యేక దృష్టి..
డీజే ఆపరేటర్లపై టీజీన్యాబ్ ప్రత్యేక దృష్టి సారించిందని సందీప్ శాండిల్య తెలిపారు. ఈ క్రమంలో కాకర్లమూడి స్వదీప్ అలియాస్ డీజే స్వాడ్ అనే డీజే.. హైదరాబాద్‌లో సంపన్నులైన యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చినట్టు గుర్తించామని వెల్లడించారు. అతడు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేవాడని పేర్కొన్నారు. థానేలో ఉండే డీజే వన్ష్ ఠక్కర్ కూడా గోవా, బెంగళూరు, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్టు తమ విచారణలో వెల్లడైందని వివరించారు.
ఇటీవల గోవాలో దాడులు చేపట్టి రూ.1.64కోట్ల విలువైన డ్రగ్స్, రూ.50లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఉత్తమ్‌సింగ్, రాజుసింగ్, మహేందర్ ప్రసాదే ఆధ్వర్యంలో హవాలా మార్గంలో ప్రతి రెండురోజులకు రూ.50లక్షల లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. నిరుడు నైజీరియా బ్యాంకుల్లోకి రూ.150 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్టు సందీప్ శాండిల్య వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | వేగంగా దూసుకెళ్తూ ట్రెయిలర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం..!
Medchel Flyover | బీజేపోళ్లు ఓట్లడిగితే ఈ ఫ్లైఓవర్లు చూపించాలి.. ఓ వాహనదారుడు.. వీడియో
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

