హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌కో ప్రతిష్టాత్మక ఎల్డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2024ను గెలుచుకున్నది. ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఈ పురస్కారాన్ని దక్కించుకున్నది. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, ఫోరమ్ ఆఫ్ లోడ్ డిస్పాచర్ సంస్థలు ఈ పురస్కారాన్ని ఇటీవల అందజేశాయని ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. కాగా ట్రాన్స్‌కోకు ఈ అవార్డు రావడం గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, చైర్మన్ అండ్ ఎండీ కృష్ణభాస్కర్‌ను అభినందించారు. ఈ అవార్డును డిసెంబర్ 14న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అందజేస్తారని తెలిపారు.