TG TET -2026 | హైదరాబాద్ : టీజీ టెట్ -2026 షెడ్యూల్ విడుదలైంది. టెట్ నోటిఫికేషన్ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2026 జనవరి 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.