TG TET -2024 | హైదరాబాద్ : టీజీ టెట్ – 2024 పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లు అంటే సెషన్ – 1 ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెషన్ -2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పేపర్-1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
జనవరి 2వ తేదీన ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్(పేపర్-2) పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 5న ఉదయం సెషన్లో సోషల్ స్టడీస్(పేపర్ -2), మధ్యాహ్నం సెషన్లో మ్యాథమేటిక్స్ అండ్ సైన్స్(పేపర్-2) పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.