TG SET | ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే టీజీ సెట్ – 2025 దరఖాస్తు స్వీకరణ గడువును పొడగించినట్లు సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 6వ తేదీలోగా ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.1500 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 19వ తేదీ వరకు, రూ.3000 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. డిసెంబర్ నెల రెండో వారంలో పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు 0040-27097733, 8331040950 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.