TG Rains | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాపాతం కురిసే నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నాటి ద్రోణి రాయలసీమ కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
శుక్రవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తెలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, జయశంకర్, నల్గొండ, హైదరాబాద్ జీహెచ్ఎంసీలో వర్షం కురిసింది. అత్యధికంగా హైదరాబాద్ నగర పరిధిలోని ఖైరతాబాద్‌లో 8.3 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.
KTR | బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Srinivas Goud | తెలంగాణ డెయిరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర : శ్రీనివాస్ గౌడ్