TG LAWCET | ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 12: రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఎల్ఎం కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్లైన్స్ విడుదల చేశారు. కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోని వారు సైతం స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని చెప్పారు. స్పాట్ అడ్మిషన్లు పూర్తిగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ను గురువారం విడుదల చేస్తామన్నారు. కాలేజ్ లింక్ ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్లను 17వ తేదీ వరకు చేసుకోవాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల కేటాయింపును 18న విడుదల చేస్తామని, 19వ తేదీ మధ్యాహ్నం పన్నెండుగంటల్లోపు సంబంధిత కళాశాలల్లో సీట్లు పొందిన అభ్యర్థులు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.