హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలలైంది. సప్లిమెంటరీ పరీక్షలు మే22నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసిన నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణాదిత్య బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
ఇదే సమ యంలో వొకేషనల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జూన్ 3నుంచి 6 వరకు ప్రాక్టికల్స్, జూన్ 9న ఫస్టియర్, 10న సెకండియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొన్నారు.