TG ICET | హైదరాబాద్ : టీజీ ఐసెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ నెల 14వ తేదీన విడుదల కానున్నాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి వీసీ వాకాటి కరుణ కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. ర్యాంకులతో పాటు మార్కులు కూడా ప్రకటించనున్నారు. దాంతో పాటు టాప్ టెన్ ర్యాంకర్ల జాబితాను కూడా విడుదల చేయనున్నారు. ఐసెట్ ఫలితాల కోసం ఈ వెబ్సైట్ను https://icet.tsche.ac.in/ క్లిక్ చేయొచ్చు.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీఇటీవలే విడుదల చేసింది.