TG ICET | హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. అభ్యర్థులు మార్చి 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 550, బీసీలు, జనరల్ విద్యార్థులు రూ. 750 ఫీజుగా చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తామని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రవి తెలిపారు.