Sircilla Collector | రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్‌కు డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదని.. ఆయన్ను చూస్తే తమకే భయంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇక ఆయన ప్రజలకు ఎలా సేవ చేస్తారని మండిపడింది. సందీప్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్ట పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి కవితపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై న్యాయం కోసం కవిత తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గతంలో న్యాయస్థానానికి హాజరైనప్పుడు సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్‌పై.. ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ప్రోసిడింగ్స్ తెలియదా.. కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా అంటూ కలెక్టర్‌పై మండిపడింది. ఇదే విషయంలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్‌పై చర్యలు ఆదేశించింది. అలాగే బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును యథావిధిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎస్‌ను ఆదేశించింది.
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కలెక్టర్‌కు డ్రెస్సింగ్ సెన్స్ లేదు.. ఆయనను చూస్తే మాకే భయంగా ఉంది. ప్రజలకు ఎలా సేవ చేస్తారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆదేశం
మిడ్ మానేరు… https://t.co/wxrJt9mGkF pic.twitter.com/7G1cuL5OGG
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2025
ఇప్పటికే సందీప్‌కుమార్ ఝాకు హైకోర్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన వేపుల ఎల్లయ్యకు భూసేకరణ పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిం ది. తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమ లు చేయలేదని నిలదీసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవడంపై మండిపడింది. కోర్టు అంటే లెక లేదా అని నిప్పులు చెరిగింది. హైకోర్టు ఆదేశాలను అ మలు చేయని కలెక్టర్‌తోపాటు భూసేకరణ అధికారికి బెయిలబుల్ వారంట్ జారీచేసింది. అక్టోబర్ 8న జరిగే విచారణ సమయంలో కలెక్టర్‌ను తమ ముందు హాజరుపర్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీ కి ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులను ఐఏఎస్ స్థాయి అధికారి అమలు చేయలేదంటే ఏమనుకోవాలని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ప్రజాపాలన దినోత్సవాల సమయంలో ప్రొటోకాల్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్‌పై సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే.