హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : టీజీ జెన్కోలో 62మంది ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. ఏకకాలంలో పదోన్నతులు కల్పించడం పట్ల విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) హర్షం వ్యక్తంచేసింది.
ఈ సందర్భంగా శనివారం ఉద్యోగులు విద్యుత్తు సౌధలో మిఠాయిలు పంచుకుని సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వీఏవోఏటీ ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య మాట్లాడుతూ కోర్టుకేసులతో అనేక ఏండ్లుగా పదోన్నతులు దక్కలేదని, ఆయా సమస్యలను పరిష్కరించి పదోన్నతులు కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.