హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి 96.38% అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు.
30,944 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా, వీరిలో 25,220 మంది అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 4.5రెట్లు ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వీ గణపతి శాస్త్రి 126 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. టాప్ 10 ర్యాంకుల్లో 7 ర్యాంకులు అబ్బాయిలే కైవసం చేసుకున్నారు. ఆగస్టులో సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.