TG EAPCET | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీఈ, బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈసారి మొత్తం మూడు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. నేటి నుంచే(శనివారం)మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నది. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఎప్‌సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఇతర అధికారులు హాజరై ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారుచేసి విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా మాక్ సీట్ అలాట్మెంట్ ఆప్షన్ ఇచ్చారు.
దీంతో విద్యార్థుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ముందే తెలియనున్నది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదులో తప్పులుంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సవరించుకోవచ్చు. జేఈఈలో మాత్రమే ఈ అవకాశముండగా ఎప్‌సెట్‌లోనూ ఈ అవకాశం కల్పించారు. రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులంతా కాలేజీల్లో తప్పనిసరిగా రిపోర్ట్‌చేయాలి. ఒరిజినల్ టీసీ, సర్టిఫికెట్ల జిరాక్స్‌లు కాలేజీల్లో సమర్పించాలి. రిపోర్ట్చేయకపోతే ఫైనల్ ఫేజ్‌లో వెబ్ఆప్షన్లకు అనుమతించరు. మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఆగస్టు 23న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
కన్వీనర్ కోటాలో ఇంటర్నల్ ైస్లెడింగ్
ఈసారి కూడా కన్వీనర్ కోటాలో ఇంటర్నల్ ైస్లెడింగ్ చేపట్టనున్నారు. తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఆగస్టు 18, 19 తేదీల్లో కన్వీనర్ కోటాలో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ ైస్లెడింగ్కు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్టు 22న సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 22, 23 తేదీల్లో సీటు వచ్చిన కాలేజీల్లో రిపోర్ట్‌చేయాలి. మూడు విడతల కౌన్సెలింగ్‌లో ఒక కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థి అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే ఇంటర్నల్ ైస్లెడింగ్ విధానంలో ఆయా సీటును ఎంపికచేసుకోవచ్చు. గతంలో ఈ ఇంటర్నల్ ైస్లెడింగ్ను కాలేజీల యాజమాన్యాలే నిర్వహించేవి. ఈ విధానంలో బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించేది కాదు. కానీ, ఇప్పుడు ఈ ఇంటర్నల్ ైస్లెడింగ్ను కన్వీనర్ కోటాలోనే చేపట్టనుండటంతో ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందనున్నది. ఇది విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు.
కొత్తగా మూడు వర్సిటీల్లో సీట్ల భర్తీ
ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక కొత్త వర్సిటీతోపాటు మరో రెండు వర్సిటీల్లోని కొత్త ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లను భర్తీచేస్తారు. పాలమూరు, శాతవాహన వర్సిటీలకు ఇంజినీరింగ్ కాలేజీలు మంజూరుకాగా వీటిలోని సీట్లను భర్తీ చేయనున్నారు. ఇక కొత్తగూడేనికి ఎర్త్‌సైన్స్ వర్సిటీ మంజూరుకాగా ఇందులోని సీట్లను ఈ విద్యా సంవత్సరం నుంచే భర్తీచేస్తారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు..
11