TG EAPCET | హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. వాస్తవానికి నేటి(ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తులను ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ ప్రకటించారు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
ఇక ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల నేపథ్యంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి జేఎన్టీయూ రెండు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. వివరాలకు 74169 23578, 74169 08215 నంబర్లను సంప్రదించవచ్చని ఎప్ఎట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అమ్మతోడు.. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయని నాకు తెలియదు : కేటీఆర్
KTR | దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్.. కడియం శ్రీహరికి కేటీఆర్ సవాల్
KTR | సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు