హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలు విడుదల TG EAPCET 2025 Results | చేస్తారు. ఫలితాల కోసం https://eapcet.tgche. ac.inవెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ‘నమస్తే తెలంగాణ’ వెబ్సైట్లోనూ ఫలితాలు లభ్యమవుతాయి. ఫలితా ల కోసం www.ntnews వెబ్‌సైట్‌ను విద్యార్థులు సంప్రదించవచ్చు.
దరఖాస్తు సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కే ఎప్‌సెట్ ఫలితాలొచ్చేస్తాయి. పరీక్షలో సాధించిన మార్కులతోపాటు పొం దిన ర్యాంకును ఎస్ఎంఎస్ రూపం లో సెల్‌ఫోన్‌కే పంపిస్తారు. తొలిసారిగా ఇలా విద్యార్థుల సెల్‌ఫోన్‌కు ఫలితాలు పంపించాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. సబ్జెక్టువారీగా స్కోర్ తెలుసుకోవాలంటే మాత్రం వెబ్సైట్లో వెతకాల్సిందే.