హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2026 నోటిఫికేషన్ బుధవారం సాయంత్రం విడుదల కానున్నది.
సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను ఈసారి కాకతీయ యూనివర్సిటీకి అప్పగించగా, సీపీగెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ రాజేందర్ కట్లను నియమించారు.