హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపె క్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) నూతన చైర్మన్‌గా మార్నేని రవీందర్రావు, వైస్ చైర్మన్‌గా కొత్తకుర్మా సత్తయ్య ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గతంలో టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఉన్న కొండూరి రవీందర్రావు, మహేందర్‌రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అంతకు ముందే వారు రాజీనామా చేశారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు బోర్డు మెంబర్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు.