హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాద మూలాలు వెలుగు చూశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించేందుకు కుట్ర పన్నుతున్న ముగ్గురిని అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని ఓ టోల్ ప్లాజా సమీపంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు పట్టుబడిన ఈ వ్యక్తుల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (35)తోపాటు మొహమ్మద్ సుహెల్, అజాద్ సైఫ్ అనే మరో ఇద్దరు ఉన్నారు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలో దాడులు జరిపేందుకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తుండగా వీరిని అరెస్టు చేశామని, నిందితులపై లోతుగా విచారణ జరుపుతున్నామని ఏటీఎస్ వెల్లడించింది.
అహ్మద్ మొహియుద్దీన్ ఫ్రాన్స్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందాడని, ఐఎస్‌కేపీకి అనుబంధంగా విదేశాల్లో పనిచేస్తున్న ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఉన్నాయని ఏటీఎస్ అధికారులు గుర్తించారు. కాగా, ఆదివారం మొహియుద్దీన్ నివాసంలో గుజరాత్ పోలీసులు సో దాలు నిర్వహించి రెండు గ్లాక్ పిస్టళ్లు, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వా ధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చడంతో న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు.