బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 11:34:41

నేటినుంచి పదో తరగతి పరీక్షలు..

నేటినుంచి పదో తరగతి పరీక్షలు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభవుతుంది. 5,34,903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అధికారులు పరీక్షలకు గాను 2,530 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30,500 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల్లో విధులు నిర్వహించనున్నారు. 144 మంది ఫ్లయింగ్‌ స్కాడ్‌ల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. విద్యాశాఖ 400 మంది సిట్టింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అవిభక్త కవలలు వీణా- వాణి ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. 

కరోనా వైరస్‌ దృష్ట్యా.. పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గుంపులుగా చేరకుండా చూడాలని అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు మాస్కులు, మంచినీటి బాటిళ్లను అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. శానిటైజర్లు సైతం అందుబాటులో ఉంచాలని తెలిపింది. దగ్గు, తుమ్ములు, జ్వరంతో బాధపడే వారికి ప్రత్యేక గది కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. 


logo