హైదరాబాద్ : ఆగస్టు 1వ తేదీ నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. 55,662 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల తమ హాల్టికెట్లను www.bse.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ప్రారంభం కంటే 2 రోజుల ముందు కూడా పరీక్షా ఫీజుతో పాటు ఆలస్య రుసుం రూ. 50 చెల్లించి, హాల్ టికెట్ పొందొచ్చని బోర్డు అధికారులు చెప్పారు.
ఆగస్టు 1 – ఫస్ట్ లాంగ్వేజ్
ఆగస్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
ఆగస్టు 3 – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
ఆగస్టు 4 – మ్యాథమేటిక్స్
ఆగస్టు 5 – జనరల్ సైన్స్(ఫిజికల్ సైన్స్, బయాలజీ)
ఆగస్టు 6 – సోషల్ స్టడీస్
ఆగస్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
ఆగస్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2