రామగిరి, మే 18 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. పదోతరగతి ఫలితాల్లో మండల స్థాయిలో టాపర్గా నిలిచిన పాగల రసీత (558 మార్కులు), శ్రీమంతుల లోహిత (557 మార్కులు)ను హెచ్ఎం మల్కా రాంకిషన్రావు తన సొంత ఖర్చులతో విమానంలో ఆదివారం వైజాగ్ టూర్కు తీసుకెళ్లారు. వీరికి అకడ వివిధ పర్యాటక ప్రాంతాలను చూపించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
టాపర్లను సొంత ఖర్చులతో టూర్కు తీసుకెళ్తానని హెచ్ఎం పరీక్షలకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు వారిని టూర్కు తీసుకెళ్లడాన్ని బేగంపేట గ్రామ ప్రజలు స్వాగతించారు. తమ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయుడికి అభినందనలు తెలిపారు.