యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లిన క్రమంలో యాదాద్రి కలెక్టరేట్ ఎదుట పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. రాజపేట మండలం చల్లూరు గుట్టల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, ప్రభుత్వ భూమి కబ్జాపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డి నేతృత్వంలో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌కు వచ్చారు. పోలీసులు వారిని కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా గేట్లు మూసివేసి అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు గేట్లు తీసుకుని కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లి చల్లూరు గుట్టల్లో చేపడుతున్న అక్రమ మైనింగ్‌పై అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వెంకారెడ్డికి ఫిర్యాదు చేశారు.