RTC Strike | డిపోల వద్ద ఉద్రిక్తత సత్తుపల్లిలో పోలీసులతో వాగ్వాదం..కల్వకుర్తిలో బస్సుపైకి రాళ్లు విసిరిన వ్యక్తులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగడంతో బుధవారం బస్సు లు రోడ్లపైకి రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ని యోజకవర్గ కేంద్రంలో డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు.
- కల్వకుర్తిలో బస్సుపైకి రాళ్లు విసిరిన వ్యక్తులు
- ప్రభుత్వ కార్యాలయాలపైనా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్
నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగడంతో బుధవారం బస్సు లు రోడ్లపైకి రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ని యోజకవర్గ కేంద్రంలో డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. ఆర్టీసీ సమ్మె కారణంగా పెద్ద ఎత్తున కార్మికులు ఆయా జిల్లాల డిపోల వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేయగా, పో లీసులు వారిని బలవంతంగా అక్కడ నుంచి తరలించే యత్నం చేశారు. దీంతో చాలా చోట్ల పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వా దంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.
సంగారెడ్డి, సత్తుపల్లి, కల్వకుర్తి డిపోల వద్ద ఉద్రిక్తత
పోలీసుల అత్యుత్సాహంతో సంగారెడ్డి డిపో వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రైవేట్ డ్రైవర్ ద్వారా సంగారెడ్డి డిపో నుంచి రెండు బస్సులను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ఆ బస్సులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో నుంచి బస్సులను బలవంతంగా తిప్పేందుకు డిపో అధికారులు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు ప్రతిఘటించారు. తాము సమ్మెలో ఉండగా బస్సులను ఎలా నడుపుతారని వాగ్వాదానికి దిగారు. హనుమకొండ-వరంగల్ లోకల్ బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డగించి, బస్సు నడుపుతున్న డ్రైవర్‌ను కిందికు దిగాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపో వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు యత్నించగా.. కార్మికులు అడ్డుకున్నారు. గుంపులోంచి గుర్తు తెలియని వ్యక్తి బస్సుపైకి రాళ్లు విసరడంతో అద్దం పగిలిపోయింది. తాత్కాలిక బస్సు డ్రైవర్ కండ్లలోకి కారంపొడి చల్లడంతో అతను బస్సు దిగి పరారయ్యాడు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయా జిల్లాల నుంచి బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపి సమ్మెలో పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ : హరీశ్‌రావు
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నరేండ్లు అవుతున్నది.. అప్పటి నుంచి తమ సమస్యలు పరిషరించాలని ఆర్టీసీ కా ర్మికులు వేడుకుంటున్నా.. ఇప్పటికీ అతీగతి లేదు. దీంతోనే కార్మికులు సమ్మెకు దిగాల్సివచ్చింది’ అని మాజీ మంత్రి న్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం కార్మికులనుద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార దాహంతో కార్మికుల సమస్యలను పకన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల మీద నెపం పెట్టి తప్పించుకుంటే ఊరుకోమని, సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

