వికారాబాద్ : వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్(Marpally police station) వద్ద ఉద్రిక్త పరిస్థితులు (Tense situation) నెలకొన్నాయి. మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను ఓ మర్డర్ కేసులో పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. పోలీసుల దెబ్బలు తాళలేక ఓ యువకుడు స్టేషన్ నుంచి పారిపోయి పోలీసులు కొట్టిన విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
అదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అయినందునే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటా పోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఆనంద్‌ను, బీఆర్ఎస్ శ్రేణులను పోలీస్ స్టేషన్ వద్ద నుంచి బయటకు పంపించేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.