హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి కోర్ రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) కింద రూ. 1542.26 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 39 రోడ్ల అభివృద్ధికి పనులను మంజూరు చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులను రద్దుచేసి రూ. 1097 కోట్లతో 53 రోడ్లకు మంజూరీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికలకు ముందే టెండర్లు పూర్తిచేయగా, ఎన్నికల కోడ్‌తో పనులు చేపట్టలేదు.
కోడ్ తొలగిపోవడంతో తొందరలోనే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకొని పనులు చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నుంచి 17 రోడ్లు ఉండగా, వాటి వ్యయం రూ. 300 కోట్లు కానుంది. ఖమ్మం జిల్లాకు రూ. 200 కోట్లతో 7 రోడ్లు, సూర్యాపేట జిల్లాకు రూ. 115 కోట్ల తో 8 రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రూ. 1097 కోట్ల పనుల్లో రూ. 615 కోట్ల పనులు ఈ మూడు జిల్లాల్లోనే చేపడుతున్నా రు. నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట్, ము లు గు జిల్లాల్లో అత్యధికంగా రోడ్ల అభివృద్ధి ప ను లు చేపడుతున్నారు.