మొయినాబాద్, మే 5: పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుత్తు షాక్‌తో మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన కంచె కృష్ణ (40), అతని కుమారుడు జశ్వంత్ ఇద్దరు కలిసి జీవనోపాధి కోసం గ్రామానికి చెందిన గూడూరి విఠలయ్య పొలాన్ని కౌలుకు తీసుకొని వరి పంట వేశారు. వరికి నీళ్లు పెట్టడానికి ఆదివారం ఉదయం కృష్ణ పొలం వద్దకు వెళ్లి స్టార్టర్ వద్ద బోరు మోటర్ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్ తగలి కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్లలోని ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.