గజ్వేల్, జూలై 20: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోల్ల స్వామి (24) తనకున్న ఎకరంతోపాటు పన్నెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మూడేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. పత్తితోపాటు ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. స్వామి తండ్రి కాలం చేశాడు. తల్లి దివ్యాంగురాలు. అప్పు చేసి సోదరి పెండ్లి చేశాడు. దీంతోపాటు వ్యవసాయంలో దిగుబడి రాక పంటల సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక జీవితంపై విరక్తి చెంది ఈ నెల 4న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. పదిహేను రోజులుగా చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. స్వామి కుటుంబాన్ని ఆదుకోవాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎగొండ స్వామి కోరారు.