శ్రీశైలం/అయిజ/ అమరచింత, ఆగస్టు 29: ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సోమవారం అధికారులు శ్రీశైలం జలాశయంలో పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 3,88,090 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా, గేట్ల నుంచి 3,75,680, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 62,914 క్యూసెక్కులు సాగర్‌కు వదిలారు. జూరాల ప్రాజెక్టుకు 1.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రా జెక్టు 17 గేట్లు ఎత్తి 1,10,05 7 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 4,19,276 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 588.80 అడుగులు ఉన్నది. 312.0450 టీఎంసీలకు 308.4658 టీఎంసీలు ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 69,659, అవుట్‌ఫ్లో 54,321 క్యూసెక్కులు నమోదైంది.