హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): పహాణీలోని పద్దుల ఆధారంగా భూయాజమాన్య హకు లు నిర్ధారణ చేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పుచెప్పింది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను తొలగిస్తూ కలెక్టర్ గత ఏడాది ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్త్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన పూజారులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, నరసింహాచార్య హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ పూర్తిచేసిన న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఇటీవల పైవిధంగా తీర్పు వెలువరించారు. రెవెన్యూ రికార్డుల్లో పిటిషనర్లతోపాటు శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలను పట్టాదారులుగా పేరొన్నారని గుర్తుచేశారు. ఈ వివాదాన్ని ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌లో తేల్చువాలని చెప్పి పిటిషన్లపై విచారణ ముగిసినట్టు ప్రకటించారు.