హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు(Hot Summer) మండి పోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత (Temperatures) 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో ఎండలు మరింత దంచికొట్టే అవకాశం ఉంది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో పగటి వేళలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం చారు. కాగా, ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధా రణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీసే అవకాశాలున్నాయని తెలిపింది. మార్చి-మే మధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల సాధారణం కంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.