Weather update | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో వేడి తీవ్రత పెరుగుతున్నది. ఆగస్టు 20 వరకు తెలంగాణలో ఉక్కపోత తప్పదని, అప్పటి వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు నెమ్మదించడంతో ఎండలు పెరుగుతున్నాయని పేర్కొన్నది. అయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆగస్టు 11 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈశాన్య రాష్ర్టాల్లో కూడా రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.