హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నా యి. మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో 32 నుంచి 37 డిగ్రీ ల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించారు.
రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతుండటంతో కాస్త చలిగా ఉన్నప్పటికీ పగటి పూట మాత్రం ఎండలు దంచికొడుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపారు.