హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : అమెరికాలో తెలుగు మహిళ జయ బాదిగకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ర్టాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా ఆమె నిలిచారు. విజయవాడకు చెందిన జయ బాదిగ.. హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్, బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ, శాంటాక్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. పదేండ్లకు పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగారు. మెక్జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగా పనిచేశారు.