హైదరాబాద్/డిండి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రైతు, తెలంగాణ ఉద్యమకారుడు మందపాటి రవీందర్‌రెడ్డి 15 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, నార్లతో జాతీయ చిహ్నం, సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలను రూపొందించారు. నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ విత్తన క్షేత్రంలో సిబ్బందితో కలిసి 10 రోజులపాటు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. పెసలు, జీలుగు, గోధుమ, వరి, వేరుశనగ, కందులు, జొన్నలు, బియ్యంతో 175 అడుగుల పొడవు, 105 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో చిత్రాలు వేసి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఈ కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించి రైతును అభినందించనున్నారు.