జీడీపీని మించి తెలంగాణ వృద్ధి.. జాతీయ సగటు కంటే ఎక్కువగా జీఎస్డీపీ
రాష్ట్రంలోని షెడ్యూల్ బ్యాంకుల్లో డిపాజిట్ల విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.6,40,556 కోట్లు!
- మౌలిక సదుపాయాల్లో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం
- ఎగుమతుల్లో వృద్ధిరేటు పరుగులు.. ఈవీల జోరు
- రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి దాదాపు సమానం
- ఉపాధి కల్పనకు పెద్దదిక్కుగా వ్యవసాయం
రాష్ట్రంలోని షెడ్యూల్ బ్యాంకుల్లో డిపాజిట్ల విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.6,40,556 కోట్లు! ఇందులో దాదాపు సగం డిపాజిట్లు రూ.3.70 లక్షల కోట్ల మేర ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్ర గణాంక శాఖ బుధవారం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. జీఎస్డీపీలోనూ, తలసరి ఆదాయంలోనూ జాతీయ సగటును మించి తెలంగాణ వృద్ధిరేటును నమోదు చేసిందని స్పష్టంచేసింది.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జీఎస్డీపీ వృద్ధిరేటు, తలసరి ఆదాయ వృద్ధిరేటు రాకెట్ వేగంతో దూసుకెళ్లినట్టు రాష్ట్ర గణాంక శాఖ బుధవారం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ నివేదిక స్పష్టం చేసింది. 2014-15లో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ 2021-22 నాటికి రూ.11.48 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నది. 2012-13లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతంగా ఉండగా, 2021-22 నాటికి 4.9 శాతానికి పెరిగిందని వెల్లడించింది. దశాబ్ద కాలంలో జీడీపీ/జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ జాతీయ సగటును మించింది.
2012-13 నుంచి 2021-22 మధ్య తెలంగాణ జీఎస్డీపీ సగటు వృద్ధిరేటు 12.4 శాతం నమోదు కాగా జాతీయ వృద్ధిరేటు 10.6 శాతానికే పరిమితం అయ్యింది. పదేండ్ల కిందట తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం రూ.లక్ష ఉండగా, 175 శాతం వృద్ధిరేటు సాధించి రూ.2.75 లక్షలకు చేరిందనిజీడీపీని మించి తెలంగాణ వృద్ధి నివేదిక వెల్లడించింది. జాతీయ తలసరి ఆదాయం మాత్రం రూ.1.50 లక్షలకు పరిమితం అయ్యింది.

- తలసరి ఆదాయం ఐదేండ్ల సగటు వృద్ధిలో (2016-17 నుంచి 2020-21 వరకు) తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సగటున 10.57 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది.
- రాష్ట్రంలో ఉపాధి కల్పనకు వ్యవసాయ, అనుబంధ రంగాలే పెద్ద దిక్కు అని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కలిపి తెలంగాణలో మొత్తం 1.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్టు నివేదిక తెలిపింది. ఇందులో 46 శాతం మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు. జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా 21 శాతమే అయినా, రెట్టింపు సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది.
- 2015-16తో పోల్చితే తెలంగాణ నుంచి ఎగుమతులు (గూడ్స్, సర్వీసెస్ కలిపి) రెండున్నర రెట్ల వృద్ధి సాధించినట్టు నివేదిక స్పష్టం చేసింది. 2015-16లో రూ.1.10 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు 2021-22 నాటికి రూ. 2.65 లక్షల కోట్ల కు పెరిగినట్టు తెలిపింది.
- కరోనాలోనూ (2019-20, 2020-21) రాష్ట్రం నుంచి వస్తు ఎగుమతులు పాజిటివ్ వృద్ధిరేటు నమోదు చేయగా, జాతీయ వృద్ధిరేటు మాత్రం రుణాత్మక వృద్ధి నమోదు చేసినట్టు వెల్లడించింది.
- రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. 2019-20 నాటికి కేవలం 3,375 ఈవీలు మాత్రమే ఉండగా ఒక్క ఏడాదిలోనే కొనుగోళ్లు దాదాపు మూడురెట్లు పెరిగాయి. 2021-22లో ఏకంగా మరో మూడురెట్ల అధిక కొనుగోళ్లు నమోదవడం విశేషం.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

