Weather Update | రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత.. వారు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యనిపుణులు
Weather Update | హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
Weather Update | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే చలికి జనం వణికిపోతున్నారు. పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఏకంగా 6.6 డిగ్రీల సెల్సీయస్ కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
అలాగే హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా నగరంలో రాత్రి వేళ్లల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. నగరంలో కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రికార్డ్ అవుతున్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చాలా మంది రాత్రిపూట, తెల్లవారు జామున వెచ్చని దుస్తులను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
ఈ సమయాల్లో ఆస్తమా, చర్మ సంబంధ, హృద్రోగ బాధితులు, చిన్న పిల్లలకు న్యూమోనియా వ్యాధుల భయం ఉన్నవారు జాగ్రత్తలు వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈశాన్యం వైపు నుంచి చలిగాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

