CEO Sudarshan Reddy | సీఈవోకూ ‘సర్’ నోటీసు.. ఇంటిపేరులో తేడాతో సుదర్శన్‌రెడ్డికి నోటీసులు జారీ
CEO Sudarshan Reddy | రాష్ట్రవ్యాప్తంగా ‘సర్' ప్రక్రియ కొనసాగుతున్నది. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల్లో అక్షర దోషాలు ఉన్నా ఆయా ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి.
CEO Sudarshan Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నది. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల్లో అక్షర దోషాలు ఉన్నా ఆయా ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి. ఓటరు రికార్డుల్లోని వివరాలకు, ఎపిక్, ఆధార్‌కార్డుల వివరాలకు మధ్య అక్షరం వ్యత్యా సం ఉన్నా నోటీసులు జారీ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే దాదాపు 93 లక్షల మందికి నోటీసులు జారీ అయ్యాయి.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డికి కూడా నోటీసు ఇచ్చారు. 2002 నాటి ‘సర్’ రికార్డు ల్లో పేరు తొలి అక్షరం ‘సీ’గా ఉండగా, ఆధార్‌కార్డులో పూర్తి ఇంటిపేరు/పేరు ఉండటం వ్యత్యాసంగా సాఫ్ట్వేర్ గుర్తించడంతో ఆయనకు కూడా నోటీసు జారీ అయింది. ‘సర్’లో గుర్తించిన వ్యత్యాసాల ఆధారంగా నోటీసులు వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్‌గా జారీ అవుతున్నాయి. సీఈవోవంటి ఉన్నతాధికారులు, మంత్రులు, వీఐపీలకు కూడా మినహాయిం పు ఉండదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇలాంటి చిన్నపాటి వ్యత్యాసాలు పెద్ద సమస్య కాదని, పేరులో తొలి అక్షరాలు, వివరాల తేడాలు ఉన్నవారు ఫామ్-8 ద్వారా సరిచేసుకునే అవకాశం ఉన్నదని స్పష్టంచేశా రు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సినీ నటి సమంతకు నోటీసులు అందాయి. పలువురు న్యాయమూర్తులు, ఇతర సినీ ప్రముఖులు, వీఐపీలకు కూడా నోటీసులు జారీ అయినట్టు తెలుస్తున్నది.
గడువు పొడిగించే అవకాశం
రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియకు కనీసం మరో మూడు వారాల గడువు పెరిగే అవకాశం ఉన్నది. గడువు పొడిగింపుపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు తెలిపాయి. గడువు పొడిగింపుతో తుది ఓటరు జాబితా నవంబర్ చివరి వారంలో వెలువడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ‘సర్’ ప్రక్రియకు అదనపు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈసీఐని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు ప్రస్తుతం ఉన్న నెలరోజుల వ్యవధి సరిపోదని, మరో నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన గడువు పొడిగింపును పరిగణనలోకి తీసుకుని ఈసీఐ కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు లేనందున ‘సర్’ ప్రక్రియను హడావుడిగా ముగించకుండా.. ప్రతి ఓటరుకూ సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాను రూపొందించాలన్నదే ఈసీఐ లక్ష్యంగా ఉన్నది. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత మూడు నెలలకు కొత్త ఎపిక్ కార్డులు జారీ కానున్నాయి. అయితే కొత్తగా నమోదైన ఓటర్లకు మాత్రమే ఇస్తారా? ప్రస్తుతం ఉన్న ఓటర్లందరికీ కొత్త కార్డులు జారీ చేస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల మొబైల్ నంబర్ల సేకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భవిష్యత్తులో ఓటర్లతో సమాచార మార్పిడి, ధ్రువీకరణ వంటి ప్రక్రియలను మరింత సులభతరం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
‘సర్’ హియరింగ్ వేగిరం చేయాలి
- అధికారులకు సీఈవో సుదర్శన్‌రెడ్డి
- మేడ్చల్ జిల్లాలో ‘సర్’ ప్రక్రియ పరిశీలన
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా నోటీసుల హియరింగ్, పరిషార ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి, అర్హులైన ఓటర్లను కచ్చితంగా నిర్ధారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ జరుగని ఓటర్లు, ఓటరు కార్డుల్లోని వ్యత్యాసాల(అనామలిస్)కు సంబంధించిన రికార్డులు, దరఖాస్తులను పకడ్బందీగా ధ్రువీకరించాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరైనప్పుడు వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, ఆధారాలను ధ్రువీకరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నర్సంపల్లి, కీసర మండలం, మునీరాబాద్, మేడ్చల్ మండలం, దొమ్మర పోచంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ‘సర్’ హియరింగ్ ప్రక్రియను సీఈవో గురువారం పరిశీలించారు. ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు, బీఎల్వోలను ఆదేశించారు. అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచిన గోదామును సీఈవో తనిఖీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

