యాదగిరే టీయూ రిజిస్ట్రార్!
తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా ఆగడాలపై పాలకవ ర్గం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీని నడిపించాల్సింది పోయి తనకు ఇష్టమొచ్చినట్టు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంపై చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని రూసా బిల్డింగ్ లో శుక్రవారం జరిగిన 57వ పాలకవర్గ సమావేశానికి సమాచారం ఇచ్చినా వీసీ రాకపోవటం, ఈసీ అనుమతి లేకుండానే ఓయూకు చెందిన మహిళా ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించటంపై చర్చించారు.
- రంగంలోకి ఏసీబీ, విజిలెన్స్
- వర్సిటీలో అక్రమాలపై విచారణ
- వీసీపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు
- ముగ్గురు ప్రొఫెసర్లపైనా చర్యలు!
- 57వ పాలకవర్గం నిర్ణయాలు
- ఈ నెల 12న మరోసారి భేటీ
- ఈసీ భేటీకి డుమ్మాకొట్టిన వీసీ
నిజామాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా ఆగడాలపై పాలకవ ర్గం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీని నడిపించాల్సింది పోయి తనకు ఇష్టమొచ్చినట్టు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంపై చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని రూసా బిల్డింగ్ లో శుక్రవారం జరిగిన 57వ పాలకవర్గ సమావేశానికి సమాచారం ఇచ్చినా వీసీ రాకపోవటం, ఈసీ అనుమతి లేకుండానే ఓయూకు చెందిన మహిళా ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించటంపై చర్చించారు. విద్యాశాఖ కా ర్యదర్శి వాకాటి కరుణ, వీసీ రవీందర్ గుప్తా, ఈసీ సభ్యుడు రాజేందర్‌రెడ్డి మినహా మిగిలిన 10 మంది సభ్యులు హాజరవటంతో, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను చైర్మన్‌గా నియమించి పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తెలంగాణ యూనివర్సిటీ (టీ యూ) క్యాంపస్‌లో రిజిస్ట్రార్ కార్యాలయంలో సంబంధం లేని వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను పాలకవర్గం కోరింది. రిజిస్ట్రార్‌గా పాలకవర్గం నియమించిన యాదగిరి మినహా ఇతరులెవ్వరూ ఆ స్థానంలో కూర్చోకుండా చూడాలన్నది. అం దుకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
టీయూ, ఓయూలో గందరగోళం
టీయూ వీసీ చేస్తున్న అవకతవకల వల్ల నిధుల దుర్వినియోగంతోపాటు నిధులు పక్కదారి పడుతున్నట్టు తెలిసింది. పాలకవర్గం యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించింది. వీసీ నెలకొకరిని మార్చుకుంటూ పోతున్నారు. తాజాగా ఓయూ నుంచి మహిళా ప్రొఫెసర్ ని ర్మలాదేవిని తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. ఆమె రాక వల్ల టీయూ రగడ కాస్త, ఓయూ దాకా పాకింది. రిలీవ్ ఆర్డర్‌ను ఒకే రో జులో రద్దు చేయటంతో రెండు వర్సిటీల్లో ఇ ప్పుడు అస్పష్టత, గందరగోళం ఏర్పడింది.
ఆ ముగ్గురిపై క్రిమినల్ కేసులు
పాలకవర్గం తీర్మానించిన దానికి విరుద్ధంగా ప్రొఫెసర్ యాదగిరికి బదులు వీసీ ఆదేశాలతో రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు ప్రొఫెసర్లు శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 3 రోజుల క్రితం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన నిర్మలాదేవీకి, టీయూకు ఎలాంటి సంబంధం లేద ని ఈసీ తెలిపింది. మరోవైపు, పాలకవర్గం నిర్ణయంతో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగనున్నది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైతం టీయూ వ్యవహారంపై విచారణ చేయబోతున్నది. అటు.. టీయూ వీసీ రవీందర్ గుప్తా మరోసారి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌పై లేఖాస్ర్తాన్ని సంధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

