TGTWREIS | హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇవాళ విడుదలైన పది ఫలితాల్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు 98.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,939 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా, 5,825 మంది ఉత్తీర్ణత సాధించారు. 41 గిరిజన గురుకుల పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ గొప్ప విజయాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి శరత్, సంస్థ కార్యదర్శి కే సీతాలక్ష్మి.. గిరిజన గురుకులాల విద్యార్థులను అభినందించారు. గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ప్రధాన కార్యాలయ అధికారుల కృషిని ప్రశంసించారు.