హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనాలిటిక్స్ అంశాలపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తున్నది. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోర్సులో మాస్టర్ ఆఫ్ ఐప్లెడ్ సైన్స్‌లో చదువుకొని అందులో చేసిన ప్రాజెక్టు వర్ ఆధారంగా ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు. ఈఏడాది ప్రపంచవ్యాప్తంగా ఫెలోషిప్ కోసం 2,600 పైగా దరఖాస్తులు వచ్చాయి.
33మంది ప్రభుత్వ అధికారులను మాత్రమే ఎంపిక చేయగా, భారతదేశం నుంచి కృష్ణభాసర్ ఒక్కరే ఎంపికకావడం విశేషం. ఫెలోషిప్‌లో భాగంగా వాషింగ్టన్ డీసీలో తొమ్మిది రోజులపాటు ట్రైనింగ్ పొందేందుకు రావాలని వరల్డ్ బ్యాంక్ అధికారులు కృష్ణభాసర్కు ఆహ్వానం పంపారు. కృష్ణభాసర్ అమెరికా వెళ్లడానికి ప్రభుత్వం అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 18 నుంచి 27వరకు అమెరికాలో ప్రత్యక్ష కోర్సు జరగనున్నది. కృష్ణభాసర్ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అభినందించారు.