ఆరోగ్య సూచీల్లో తెలంగాణ భేష్
ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు
- జాతీయ స్థాయిలో మూడో స్థానం
- నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో వెల్లడి
- ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యల సత్ఫలితం
- 13.29 లక్షల మందికి కేసీఆర్ కిట్లు
- 41 లక్షల గర్భిణులకు ‘అమ్మ ఒడి’
- ఆరోగ్యశ్రీలో 25 లక్షల శస్త్రచికిత్సలు
- సర్కారు వైద్యంపై పెరిగిన నమ్మకం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలో మాతృమరణాల రేటు(ఎంఎంఆర్), శిశు మరణాల రేటు(ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు( ఎన్ఎంఆర్), ఐదేండ్లలోపు పిల్లల మరణాల రేటు(యూఎస్ఎంఆర్)లో గణనీయ మార్పు నమోదైంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఆరోగ్య సూచీలో ఈ విషయం స్పష్టమైంది.
కేసీఆర్ కిట్.. రూ.1,176 కోట్లు
2017లో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. ఇప్పటివరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. వారికి ఆర్థికసాయం కింద 1,176 కోట్లను బదిలీ చేసింది. గర్భిణులు, బాలింతల రవాణాకు పెట్టిన అమ్మ ఒడి వాహనాలను 41 లక్షల మంది వినియోగించుకొన్నారు. నవజాత శిశువుల కోసం 35 ఎస్ఎన్సీయూలు పనిచేస్తున్నాయి. టీకాల పంపిణీలో రాష్ట్రం 99% లక్ష్యాన్ని సాధించింది.
బస్తీ దవాఖానలు.. ఉచితంగా పరీక్షలు
పట్టణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి జీహెచ్ఎంసీ పరిధిలో 259 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయి. వీటిలో 195 రకాల మందులు, 57 రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు సెకండరీ హెల్త్ కేర్‌లో 10,170 పడకలతో 175 దవాఖానలు సేవలందిస్తున్నాయి. తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్యవిద్యను ప్రజలకు చేరువచేసింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత డయాగ్నస్టిక్ కేం ద్రాలను ఏర్పాటు చేసి హబ్ & స్పోక్ మాడల్ కింద రక్త పరీక్షలు, ఈసీజీ, ఎక్స్-రే, యూఎస్జీ వంటి డయాగ్నస్టిక్ సేవలను అందిస్తున్నది. 20 జిల్లాల్లో ఏర్పాటుచేసిన ల్యాబు ల్లో ప్రతినెలా దాదాపు 4 లక్షల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం హబ్‌ల్లో పాథాలజీ, రేడియాల జీ, వైరాలజీ సేవలను కూడా అందిస్తున్నాయి.
25 లక్షల ఆపరేషన్లు.. 13 లక్షల మందికి లబ్ధి
ఆరోగ్యశ్రీ ద్వారా 87.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది. ఇప్పటివరకు 25 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. 13 లక్షలకు పైగా రో గులు లబ్ధిపొందారు. నిరుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేసింది.
- రాష్ట్రంలో 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయి. 27 బ్లడ్ బ్యాం కుల్లో కాంపోనెంట్ సెపరేటర్లు ఉన్నాయి.
- ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రభు త్వం ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ను ప్రవేశపెట్టింది. డైట్ చార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్ మెనూ పెట్టింది.
- రూ.61 కోట్ల అంచనా వ్యయంతో 29 టీచింగ్ హాస్పిటళ్లు, 20 జిల్లా దవాఖానలు, 30 సీహెచ్‌సీల్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ పనులు మంజూరయ్యాయి. ఇవి పురోగతిలో ఉన్నాయి.
- రూ.31 కోట్ల అంచనా వ్యయంతో 153 దవాఖానల్లో ఫైర్ సేఫ్టీ పనులు మంజూరయ్యాయి.
- రూ.61 కోట్లతో 20 దవాఖానల్లో మురుగునీ టి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) మంజూరయ్యాయి.
- 61 దవాఖానల్లో మార్చురీల మరమ్మతు, పునరుద్ధరణ, అప్‌గ్రేడేషన్ పనులు మంజూరయ్యాయి.
- డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్, టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

