రాష్ట్రంలో దక్షిణాది డీజీపీల సదస్సు
దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సుకు తెలంగాణ ఆతిథ్యమివ్వనున్నది. వచ్చే నెల లో జరిగే ఈ ప్రాంతీయ సదస్సుకు విసృ్తత ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వామపక్ష తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, తీరప్రాం త భద్రత, కొత్త తరహా నేర ధోరణులు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్న ట్టు వెల్లడించారు.
- వచ్చే నెలలో నిర్వహణకు ఏర్పాట్లు
- డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సుకు తెలంగాణ ఆతిథ్యమివ్వనున్నది. వచ్చే నెల లో జరిగే ఈ ప్రాంతీయ సదస్సుకు విసృ్తత ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వామపక్ష తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, తీరప్రాం త భద్రత, కొత్త తరహా నేర ధోరణులు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్న ట్టు వెల్లడించారు.
శుక్రవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మానవ వనరుల ఆడిట్, పునర్వ్యవస్థీకరణ, హోంగార్డుల కొరత, ప్రస్తుతం జరుగుతున్న పోలీస్ నియామక ప్రక్రియ, ఐపీఎస్ అధికారుల నూతన సం ఘం ఏర్పాటు, ‘క్యూర్ ఏరియా’ కమ్యూని టీ కనెక్ట్ కార్యక్రమాలు, పరిపాలన, బడ్జెట్, సంక్షేమ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లోని 573 మంది సిబ్బందికి 60% అదనపు చెల్లింపులను ఉపసంహరించడం ద్వారా రూ. 28.16 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిట్ కాప్’ కార్యక్రమాన్ని అమలు చేయాలని డీజీపీ నిర్ణయించారు. కార్యక్రమంలో డీజీలు, అడిషనల్ డీజీలు, సీపీలు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

