హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఏపీ ఎప్‌సెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ఇద్దరు చొప్పున నలుగురు రాష్ట్ర విద్యార్థులు టాప్-10లో నిలిచారు. ఇంజినీరింగ్ విభాగం స్టేట్ టాపర్‌గా హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్‌రెడ్డి నిలిచాడు.
హనుమకొండ జవహార్కాలనీకి చెందిన శాగంటి త్రిశూల్ 8వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో హైదరాబాద్‌లోని మదీనగూడకు చెందిన విద్యార్థి షణ్ముఖ నిశాంత్ అక్షింతల రెండో ర్యాంకు సాధించాడు. హనుమకొండలోని సుబేదారికి చెందిన యంత్రపతి షణ్ముణ్ నాలుగో ర్యాంకు సాధించాడు.