హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో తెలంగాణ విద్యార్థి మెహుల్ బోరాడ్ గోల్డ్‌మెడల్ సాధించాడు. హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన మెహుల్ బొరాడ్ ఐదుగురితో కూడిన బృందంలో సభ్యుడిగా ఒలింపియాడ్‌లో పాల్గొన్నాడు.
జపాన్ రాజధాని టోక్యోలో ఈ నెల 10 నుంచి 17 వరకు జరిగిన ఈ ఒలింపియాడ్‌లో మన దేశానికి చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలను, ఇద్దరు రజత పతకాలను కైవసం చేసుకొన్నారు. మెహుల్ బొరాడ్తో పాటు ఢిల్లీకి చెందిన ఆదిత్య, పూణేకు చెందిన ధ్రువ్షాలు బంగారు పతకాలను సాధించగా, చండీగఢ్‌కు చెందిన రాఘవ్ గోయల్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రిథమ్ కేడియాలు రజత పతకాలను కైవసం చేసుకొన్నారు.