Indian Student | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) అనారోగ్యంతో మృతిచెందాడు.
ఉన్నత విద్య కోసం కొంతకాలం కిందట అమెరికాకు వెళ్లిన అరుణ్ ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. టెంపాలో స్టెమ్ ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)గా ఉన్నాడు. ప్రస్తుతం ఫుల్ టైమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 13వ తేదీన అరుణ్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కాసేపటికే అరుణ్ మరణించాడు. ఈ విషయం తెలియడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.